తిరుమల బాయ్స్ హాస్టల్ ప్రారంభోత్సవం
రంగారెడ్డి: జులై 22(భారత్ కి బాత్)
శ్రీ శివ మార్కండేయ వనస్థలిపురం పద్మశాలి వసతి గృహ ట్రస్ట్ వారి సహకారంతో వనస్థలిపురం పద్మశాలి భవనం నందు ఆనబత్తుల సత్యనారాయణ నేతృత్వంలో శ్రీ రంగాపురం కాలనీ రోడ్ నెంబర్ 8, ఇంజాపూర్ చెరువు కట్ట, కట్ట మైసమ్మ టెంపుల్ ఎదురుగా తిరుమల బాయ్స్ హాస్టల్ ను 21.07.2024 ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం శ్రీ శివ మార్కండేయ బాలుర వసతి గృహం ట్రస్ట్ చైర్మన్ శ్రీ మాన్య సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ గజం గోవర్ధన్, తెలంగాణ ప్రాంత పద్మశాలి అధ్యక్షులు శ్రీ గోష్క యాదగిరి, రచ్చ లక్ష్మయ్య, ఎక్కలదేవ్ మురళి, పున్న రాములు, నోముల అశోక్, పోట్టబత్తిని జ్ఞానేశ్వర్, బొమ్మ అరుణ్ కుమార్, అప్పం చంద్రమౌళి, వనస్థలిపురం శ్రీ శివ మార్కండేయ బాలుర వసతి గృహం ట్రస్ట్ సభ్యులందరూ పద్మశాలి కుల బంధువులందరూ పాల్గొనడం జరిగింది. ఈ తిరుమల హాస్టల్ గురించి సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ హాస్టల్ లో చిరుధాన్యాలతో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కూరగాయలతో ఆరోగ్యకరమైన రుచికరమైన భోజనం అందించడమే లక్ష్యంగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ హాస్టల్ పద్మశాలి వంశస్తులచే నిర్మించబడిన హాస్టల్ కాబట్టి పద్మశాలి విద్యార్థులకు మరియు బిసి విద్యార్థులకు ప్రత్యేకమైన కన్సెషన్ ఇవ్వబడును అని వివరించారు.