ఇంజాపూర్ లో నూతనంగా ప్రారంభమైన ఎస్ఎస్ డయాగ్నొస్టిక్ సెంటర్
రంగారెడ్డి: జులై 1(భారత్ కి బాత్)
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఇంజాపూర్ పరిధిలోని మిధాని కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్ డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు, ఇబ్రహీంపట్నం బిజెపి కంటెస్టెడ్ ఎమ్మెల్యే నోముల దయానంద్ గౌడ్. అలాగే ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర యువ నాయకులు నోముల కార్తీక్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శివ కుమార్ మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల రక్త, ఈసిజి పరీక్షలు నిర్వహించుతామని, నాణ్యత, 100% ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయని తెలిపారు. చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల వరకు ఇంటికే వచ్చి పరీక్షలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొనడం జరిగింది.