శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి నివాళులు అర్పించిన కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి
రంగారెడ్డి: జనవరి 23(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్లోని నేతాజీ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి సందర్భంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జననమే తప్ప మరణం తెలియని వీరుడని, దేశ స్వతంత్ర ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించి, నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అనే నినాదాన్ని దేశం నలుమూలలా వినిపించి స్వతంత్ర ఉద్యమానికి వేలాది మంది సైనికులని ఏర్పాటు చేసి భారతావనిలో దేశభక్తిని రగిలించి ఆజాద్ హిందూ ఫౌజ్ దళాన్ని స్థాపించి, ఆంగ్లేయుల గుండెల్లో వణుకు పుట్టించిన భారతమాత ముద్దుబిడ్డ శ్రీ నేతాజీ సుభాష్ చంద్ర బోస్. దేశానికి చేసిన సేవలను ఎన్నటికీ మరువలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం సభ్యులు, భాజపా నాయకులు, స్థానిక యువకులు తదితరులు పాల్గొన్నారు.