Search for:
  • Home/
  • क्षेत्र/
  • ధ్యానం గొప్ప జ్ఞానం: మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎల్.హెచ్.పి.ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరథ్ నాయక్

ధ్యానం గొప్ప జ్ఞానం: మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎల్.హెచ్.పి.ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరథ్ నాయక్

రంగారెడ్డి: డిసెంబర్ 27(భారత్ కి బాత్)

ధ్యానం గొప్ప జ్ఞానాన్ని ఇస్తుందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ధ్యాన పిరమిడ్ మనందరికీ అందుబాటులో ఉందని, జీవ హింస చేయకుండా, ధ్యానం చేసి మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని తెలిపారు. ప్రతి సంవత్సరం మహా ధ్యాన మహేశ్వర పిరమిడ్ ఆధ్వర్యంలో 11 రోజులపాటు ధ్యానంతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ ధ్యానం కోసం దేశ విదేశాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారని, ధ్యానుల వసతుల కోసం పిరమిడ్ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ధ్యాన మహా పిరమిడ్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ జోగు వీరయ్య, గంప శీను, అంజి, శ్రీకాంత్, మహేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required