రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మృతురాలి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేత
రంగారెడ్డి: డిసెంబర్ 27(భారత్ కి బాత్)
కడ్తాల్ మండల కేంద్రంలో రాయి కంటి సాలమ్మ అనారోగ్యంతో శుక్రవారం నాడు మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల దశరథ్ నాయక్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో కలిసి సాలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించినారు. అనంతరం సాలమ్మ మృతదేహానికి పూలమాల వేసి, నివాళి అర్పించి, తదుపరి జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని జైపాల్ యాదవ్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జోగు వీరయ్య, నాయకులు మంగళపల్లి నరసింహ, లాయక్ ఆలీ, పాండు, సురేష్, భిక్షపతి, రాజు, శ్రీకాంత్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.