ఆరోగ్యమే మహాభాగ్యమన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
రంగారెడ్డి: డిసెంబర్ 27(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ లోని బీడీఎల్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో వెల్ నెస్ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వెల్ నెస్ హాస్పటల్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈ యొక్క ఉచిత వైద్య శిబిరంలో జనరల్, బీపీ, షుగర్ పరీక్షలు చేస్తారని, కాలనీవాసులు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతివ్యక్తి దైనందిన జీవితంలో తమ పనులను ఏ విధంగా చక్కదిద్దుకుంటారో, అదేవిధంగా నిత్యం ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని, ప్రజలందరూ వైద్య పరీక్షలు చేయించుకొని అవసరమైన మందులను తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో డా. ఇర్ఫాన్, డా. సన, బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవింద చారి, బీడీఎల్ కాలనీ ప్రధాన కార్యదర్శి అచ్చిరెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.