ఎమ్మెల్సీ కవితకు ఆరెకటికల సమస్యలను వివరించిన కళ్యాణ్ కార్ జాంగిర్ జి
హైదరాబాద్: డిసెంబర్ 26(భారత్ కి బాత్)
తెలంగాణ ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో గురువారం నాడు తెలంగాణ ఆరెకటిక సంఘము ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జి హైదరాబాదులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని స్వగృహములో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించి, ఆరెకటికల సమస్యల మీద వివరించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ కార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆరెకటికలు 20 లక్షల జనాభా ఉన్నారని, వారు బీద జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారని, మండిల నుండి ప్రభుత్వానికి వేలకోట్లు వెళ్తున్నాగానీ, ప్రభుత్వం నుండి తగు వసతులు ఆరెకటికల కోసం తీసుకోవడంలేదని వాపోయారు. సత్వరమే ప్రతిపక్షం అంత కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఆరెకటికల కోసం 1000 కోట్లతో కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాల్సిందిగా ఎమ్మెల్సీ కవితకి విన్నవించిన కళ్యాణ్ కార్ జాంగీర్ జీ.