సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్ చిగిరింత పారిజాత నరసింహ రెడ్డి
రంగారెడ్డి: అక్టోబర్ 19(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని 15 వ డివిజన్ పరిధిలో పద్మావతి కాలనీ, సీతా ఎవెన్యూ కాలనీలో శనివారం నాడు సిసి రోడ్డు నిర్మాణ పనులను టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నాణ్యత పరిమాణాలతో కూడిన నిర్మాణo చేపట్టాలని, రోడ్ల పైన నీరు నిల్వ లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, బండారి మనోహర్, నాయకులు ఎర్ర జైహింద్, అఫ్జల్, మహమ్మద్, అధికారులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.