కుంట్లూరు రాజీవ్ గృహకల్ప దగ్గర చాయ్ గరమ్ ఘనంగా ప్రారంభం
రంగారెడ్డి: సెప్టెంబర్ 7(భారత్ కి బాత్)
కుంట్లూరు నుండి గౌరెల్లి వెళ్లే దారిలో రాజీవ్ గృహకల్ప దగ్గర బి. కిషోర్ నేతృత్వంలోని చాయ్ గరమ్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ గ్యారల శ్రీనివాస్ గౌడ్, కుంట్లూరు వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నందుకు చాయ్ గరమ్ యజమాని కిషోర్ ను అభినందించారు. యాజమాన్యం వారు మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల టీలతో పాటు బెల్లం చాయ్ ను స్పెషల్ గా అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా లస్సి, మిల్క్ షేక్స్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ కూడా లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ రావు, ప్రేమ్ శివ అభి, చిన్ను, పవన్ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.