Search for:
  • Home/
  • क्षेत्र/
  • మతసామరస్యానికి ప్రతీక రంజాన్: ముదాబిర్ ఖాన్

మతసామరస్యానికి ప్రతీక రంజాన్: ముదాబిర్ ఖాన్

ఎల్. బి. నగర్: ఏప్రిల్ 6(భారత్ కి బాత్)

 

రంజాన్ సందర్భంగా వనస్థలిపురం డివిజన్ పరిధిలోని హిల్ కాలనీలో నిర్వాహకులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అడ్వకేట్ ముధాబిర్ ఖాన్ ఆధ్వర్యంలో శనివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బి.ఎన్. రెడ్డి మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న, మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ చింతల రవి, సీనియర్ లీడర్ జగన్మోహన్, ప్రాంతీయ నాయకులు, లోటస్ లాప్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మైనార్టీ పెద్దలందరూ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అల్లా దయవల్ల ప్రజలందరూ బాగుండాలని కోరుతూ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నిర్వాహకులు ముధాబిర్ ఖాన్ మాట్లాడుతూ గత 11 ఏళ్ల నుండి ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక్కడ కులమతాలకు అతీతంగా అందరికీ ఆతిథ్యం ఇవ్వబడుతుందని అన్నారు. మొత్తం ఇఫ్తార్ విందులో దాదాపుగా 1500 మందికి పైగా పాల్గొని నమాజు చేసి పండ్లు, భోజనం స్వీకరించారని పేర్కొన్నారు. అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జబీర్, సల్మాన్ ఖాన్, అక్బర్, వసీం, సలీం, హైమద్, మొయిజ్, బంధుమిత్రులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required