రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సూపర్డెంట్ గా అవార్డు అందుకున్న రమేష్ నాయక్
రంగారెడ్డి: జనవరి 26(భారత్ కి బాత్)
అమనగల్లు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సూపర్డెంట్ గా విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ పేషీలో విధులు నిర్వహిస్తున్న రమేష్ నాయక్ కి గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక్ చేతుల మీదుగా ఉత్తమ పర్యవేక్షకులు(సూపర్డెంట్ )గా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు రావడంతో మరింత బాధ్యత పెరిగిందని మెరుగైన సేవలందిస్తానని రమేష్ నాయక్ తెలిపారు.