Search for:
  • Home/
  • क्षेत्र/
  • ప్రజలందరికీ రాజ్యాంగo సమాన హక్కులు కల్పించింది: సిపి సుధీర్ బాబు ఐపీఎస్

ప్రజలందరికీ రాజ్యాంగo సమాన హక్కులు కల్పించింది: సిపి సుధీర్ బాబు ఐపీఎస్

రంగారెడ్డి: జనవరి 26(భారత్ కి బాత్)

 

శుక్రవారం నాడు రాచకొండ కమిషనరేట్‌, నేరేడ్‌మెట్‌లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సీపీ సుధీర్ బాబు ఐపీఎస్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ మరియు రాజ్యాంగ పరిషత్ సభ్యులు భారత రాజ్యాంగానికి సంపూర్ణతను తీసుకురావడంలో పోషించిన పాత్రను గుర్తుచేశారు.

 

దేశ స్వాతంత్య్ర విశిష్టతను వివరించి, స్వాతంత్య్ర సమరయోధుల కృషిని కమిషనర్ అందరికీ గుర్తు చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల చెమట, రక్తంతో సాకారమైన స్వతంత్ర దేశం, గణతంత్ర దేశంగా చక్కటి పరిపాలనతో అభివృద్ధి చెందడంలో రాజ్యాంగం ప్రముఖ పాత్ర పోషిస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. దేశంలో అన్ని రకాల వివక్షలూ రూపుమాపి, ప్రజలందరికీ సమానంగా హక్కులు కల్పించి, విభిన్న ప్రాంతాల, సంస్కృతుల ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిన గొప్పదనం భారత రాజ్యాంగానిదేనని కమిషనర్ పేర్కొన్నారు. వెనకపడిన తరగతుల ప్రజలకు, వివిధ రకాలుగా వివక్షకు, అణచివేతకు గురైన వర్గాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడంలో రాజ్యాంగం పోషిస్తున్న పాత్రను సీపీ గుర్తు చేశారు.

 

సిబ్బందిని ఉద్దేశించి సీపీ మాట్లాడుతూ, పోలీసులు అందరూ కలసికట్టుగా ఒక కుటుంబంలా పని చేయాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సమిష్టి కృషితోనే శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యం అవుతుందని తెలిపారు. ప్రజలకు సత్వర సేవలు అందించడంలో రాచకొండ పోలీసులు చేస్తున్న కృషిని అభినందించి, ప్రజలకు సేవ చేసేందుకు సిబ్బంది పునరంకితం కావాలని సూచించారు. తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ స్వాతంత్య్ర సమరయోధులు, పోలీసు అమరవీరుల అమర త్యాగాలను స్మరించుకోవాలని సిబ్బందికి సీపీ సూచించారు.

 

ఈ వేడుకల్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ సీపీ జి. సుధీర్ బాబు ఐపిఎస్ , డీసీపీ అడ్మిన్ ఇందిర, అదనపు డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required