75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కళ్లెం నవజీవన్ రెడ్డి
రంగారెడ్డి: జనవరి 26(భారత్ కి బాత్),
హయత్ నగర్ డివిజన్ పరిధిలోని వార్డు ఆఫీస్, ప్రభుత్వ పాఠశాలలో, గాంధీ బొమ్మ, వివిధ కాలనీలు, బస్తిలలో 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎందరో స్వాత్రంత్ర యోధుల పోరాట ఫలితంగా స్వాత్రంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం రచించి అమలుకు తెచ్చిన రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ఎన్నో దేశాల నుండి పలు విషయాలు తీస్కొని ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా ఎర్పడ్డదని తెలిపారు. ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగ హక్కులు తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్ళు, వివిధ కాలనీ సంక్షేమ సంఘము నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.