రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
రంగారెడ్డి: జనవరి 26(భారత్ కి బాత్)
హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి శుక్రవారం నాడు డివిజన్ లోని రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేసినా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు కార్పొరేటర్ కి కాలనీలోని పలు సమస్యలపై వివరించగా కార్పొరేటర్ స్పందించి కాలనీ సమస్యలు అన్ని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని, అదేవిధంగా కాలనీ అభివృద్ధి పనులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు ఉంటాయని తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, భాజపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.