హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డిని కలిసిన ఎస్ హెచ్ ఎమ్ వి ఫౌండేషన్ సభ్యులు
ఎల్. బి. నగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డిని బుధవారం నాడు ఎస్ హెచ్ ఎమ్ వి సభ్యులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు సరస్వతి హిందీ మహా విద్యాలయ ఫౌండేషన్ SHMV Foundation (కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందిన సంస్థ) గురుంచి కార్పొరేటర్ కి వివరించడం జరిగింది. కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలో సంస్థకు తనవంతు సహాయం చేస్తానని మాట ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు డా. గుండాల విజయ కుమార్, వైస్ ప్రెసిడెంట్ నాయిని శ్రీకాంత్ రెడ్డి, సభ్యులు జె. రాజు తదితరులు పాల్గొన్నారు.
Video Player
00:00
00:00