తుర్కయంజాల్ లో నూతనంగా ప్రారంభమైన టి24 అవర్స్
రంగారెడ్డి: అక్టోబర్ 7(భారత్ కి బాత్)
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాగార్జునసాగర్ రహదారిలో తుర్కయంజాల్ లో శుభం కన్వెన్షన్ పక్కన శ్రీనివాస్ ప్రవీణ్ నేతృత్వంలో టి24 అవర్స్ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యాజమాన్యం వారు మాట్లాడుతూ ఓపెనింగ్ ఆఫర్ గా 1రూ. కి టీ అందిస్తున్నామని తెలిపారు. తమ వద్ద అన్ని రకాల టీలు అందరికి అందుబాటులో ఉండే ధరల్లో లభిస్తాయన్నారు. యువత ఆహ్లాదకరంగా కూర్చుని టీ త్రాగే వాతావరణం తమ టి24 అవర్స్ లో లభిస్తుందన్నారు. తమ స్నేహితులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.