Search for:
  • Home/
  • क्षेत्र/
  • వనస్థలిపురంలో నూతనంగా ప్రారంభమైన జేఎస్ హాస్పిటల్

వనస్థలిపురంలో నూతనంగా ప్రారంభమైన జేఎస్ హాస్పిటల్

రంగారెడ్డి: అక్టోబర్ 7(భారత్ కి బాత్)

 

ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం గురుద్వార్ రోడ్డులో హుడా కాలనీ ఏ క్వార్టర్స్ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన జేఎస్ హాస్పిటల్ ను ఆదివారం నాడు ఎల్బీనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ వనస్థలిపురం పరిసర కాలనీవాసులకు గత 20 సంవత్సరాలనుండి పరిచయస్తులైన ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాసులు, గైనకాలజిస్ట్ డాక్టర్ జయంతిల నేతృత్వంలో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని, తక్కువ ధరలకే చికిత్సలు నిర్వహిస్తున్నారని కితాబునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి. రామదాస్ తేజవత్, గండ్ల ఆనంద్ రాజ్, నెహ్రూ నాయక్, వెంకయ్య, సతీష్, సత్యనారాయణ, శ్రీనివాస్ చౌదరి, అమర్జీత్ సింగ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required