75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బాద్య నాథ్ చౌహాన్
రంగారెడ్డి: జనవరి 26(భారత్ కి బాత్)
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ (అబ్కారీ) శాఖ కార్యాలయంలో శుక్రవారం నాడు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అమనగల్లు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ సీఐ బాధ్య నాధ్ చౌహన్ పాల్గొన్నారు. సీఐ ముందుగా మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ ఎస్సైలు యాదయ్య, స్వప్న, హెడ్ కానిస్టేబుల్ శంకర్, రాజేంద్ర ప్రసాద్, కానిస్టేబుల్ సిబ్బంది లోక్యా, దశరథ్, సురేష్, బాబు, నర్సింహా, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.