Search for:
  • Home/
  • क्षेत्र/
  • తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న సునీల్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: కళ్యాణ్ కార్ జాంగిర్ జి

తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న సునీల్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: కళ్యాణ్ కార్ జాంగిర్ జి

రంగారెడ్డి: జనవరి 27(భారత్ కి బాత్)

 

ఆరెకటిక కార్పొరేషన్ కు 500 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని తెలంగాణ ఆరెకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జి ప్రభుత్వాన్ని కోరారు. జాంగిర్ జి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆరెకటికల జనాభా 20 లక్షల మంది ఉన్నామని, చాలా కుటుంబాలు మటన్ వ్యాపార మీద జీవనం సాగిస్తున్నారని, ఇప్పటివరకు ఏ ప్రభుత్వo కూడా ఆరెకటికలను గుర్తించి, చట్టసభలలో ఆరె కటికలకు నామినేట్ పోస్టులు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వానికి మేకల మండీలపైన కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి పోతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో 9 మేకల మండీలు ఉన్నాయన్నారు. మేకల మండిలపై ఆధారపడి ఆరెకటికలు జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. మేకల మండీల పని చేస్తున్న ఆరె కటికలను అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అదే విధంగా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ఆరెకటిక సునీల్ కుమార్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ ఆరెకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జహంగీర్ జి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required