కొంగరకలాన్ లో ప్రారంభమైన కేన్స్ ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ కేంద్రం
ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
రంగారెడ్డి: ఆగష్టు 24(భారత్ కి బాత్)
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజికవర్గం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ ప్రాంతంలో నెలకొల్పిన కేన్స్ ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ పరిశ్రమను శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఇతర ప్రముఖులతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ పరిశ్రమల ఏర్పాటు కారణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడుతుందని వారు తెలియచేశారు.