Search for:
  • Home/
  • क्षेत्र/
  • ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా: కళ్యాణ్ కార్ జహంగీర్ జీ

ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా: కళ్యాణ్ కార్ జహంగీర్ జీ

రంగారెడ్డి: ఫిబ్రవరి 17(భారత్ కి బాత్)

ఆమనగల్ పట్టణంలో ఫిబ్రవరి 18 వ తారీఖు మంగళవారం నాడు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే రైతు మహాధర్నాకు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్ విచ్చేయుచున్న సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మరియు తెలంగాణ రాష్ట్ర మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్, మాజీ జెడ్పిటిసి, ఉప్పల ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ నాయకత్వంలో కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న తెలంగాణ బీసీ మహాసభ నాయకులు అందరూ పెద్ద ఎత్తున రైతు మహాధర్నాకు విచ్చేయుచున్నారని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జహంగీర్ జీ సోమవారం నాడు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సంపంగి శ్రీశైలం, నాగేష్, శంకర్ జి, ప్రసాద్ జి, నరేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required