నాగోల్ లో నూతనంగా ప్రారంభమైన ఏసర్ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్
హైదరాబాద్: జనవరి 24(భారత్ కి బాత్)
ఎలక్ట్రిక్ బైక్ లతో అనేక లాభాలు ఉన్నాయని, స్వయం శక్తితో సొంతంగా వ్యాపార రంగంలో రాణించాలని టీపీసీసీ ప్రచార కమిటీ స్టేట్ కో కన్వీనర్, ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. శుక్రవారం నాడు నాగోల్ లోని హనుమాన్ నగర్ లో జరిగిన ఏసర్ ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ ను ఆయన ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప్పల మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న జీవన ప్రమాణాలు, ప్రజల అవసరాలకు తగినట్లుగా ప్రస్తుత కాలంలో ఎలక్ట్రికల్ వాహనాలకు డిమాండ్ పెరిగిందని, పొల్యూషన్ కంట్రోల్ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎలక్ట్రికల్ బైక్స్ మీద ట్యాక్స్ లేకుండా చేస్తున్నారన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్, నగేశ్, అనాఘ మోటార్స్ వంశీ, స్నేహితులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.