సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చిగురింత నరసింహారెడ్డి
హైదరాబాద్: జనవరి 2(భారత్ కి బాత్)
బడంగ్పేట్ మాజీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిగురింత నర్సింహ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జూబ్లీహిల్స్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డిని గురువారం నాడు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగురింత పారిజాత నర్సింహరెడ్డి దంపతులు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు.