రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎల్ హెచ్ పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరథ్ నాయక్
నవ తెలంగాణ, మన తెలంగాణ క్యాలెండర్లు ఆవిష్కరించిన దశరథ్ నాయక్
రంగారెడ్డి: జనవరి 1(భారత్ కి బాత్)
ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, కడ్తాల్ మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ కడ్తాల్ మండల కేంద్రంలో స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి, రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. అనంతరం నవ తెలంగాణ, మన తెలంగాణ క్యాలెండర్లను తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైసీపీ ఆనంద్, డైరెక్టర్ వీరయ్య, మాజీ సర్పంచ్ హరిచంద్ నాయక్, డైరెక్టర్ సేవ్య నాయక్, గ్రామ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ, నాయకులు మంగళపల్లి నరసింహ, పాండు నాయక్, శ్రీను నాయక్, భీమన్, శ్రీను, రాజు, శ్రీకాంత్, సక్రు, మోతిలాల్, వినోద్, రతన్, లక్ష్మణ్, చందర్ తదితరులు పాల్గొన్నారు.