కడ్తాల్ తహశీల్దారును సన్మానించిన మాజీ జెడ్పిటిసి దశరథ్ నాయక్
రంగారెడ్డి: అక్టోబర్ 30(భారత్ కి బాత్)
కడ్తాల్ మండల తహశీల్దారు ముంతాజ్ ను బుధవారం నాడు కడ్తాల్ మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ శాలువాతో సన్మానించారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో కడ్తాల్ మండల కేంద్రంలో పూర్తైన నూతన భవనంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఎమ్మార్వో ముంతాజ్ ను శాలువాతో సన్మానించి, స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి దశరథ్ నాయక్ మాట్లాడుతూ కడ్తాల్ మండల కేంద్రానికి నూతన తహశీల్దారు కార్యాలయం కోసం తాను ఎంతగానో శ్రమించి, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ సహకారంతో నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. మొత్తానికి కడ్తాల్ మండల కేంద్రంలో నూతన ఎమ్మార్వో ఆఫీస్ ప్రారంభమైనందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లాలికోట భారతమ్మ, నరసింహ గౌడ్, పాండు, నేనావత్ భిక్య తదితరులు పాల్గొన్నారు.