రావిరాల గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ ఋణపడి ఉంటాను: అందెల శ్రీరాములు
బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న అందెల
రంగారెడ్డి: అక్టోబర్ 7(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలోని రావిరాల గ్రామంలో 402, 403 బూత్ లలో స్థానిక కౌన్సిలర్, శక్తి కేంద్రం ఇంచార్జ్ శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతూ బిజెపి సభ్యత్వ నమోదును చేయించారు. అనంతరం అందెల శ్రీరాములు మాట్లాడుతూ రావిరాల గ్రామంలో 2018వ సంవత్సరంలో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికలప్పటినుండి నేటి 2024 పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రతి ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ ఇచ్చినందుకు వారికి ఎల్లప్పుడూ ఋణపడి ఉంటానని తెలిపారు. తుక్కుగూడ మున్సిపాలిటీ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారని వారందరినీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా సభ్యత్వ నమోదు ద్వారా చేర్పించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు రచ్చ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్, బూత్ అధ్యక్షులు లింగం రాజ్ కుమార్, ఉప్పునూతల యాదగిరి, గున్నాల శ్రీనివాస్, గ్రామ పెద్దలు, యువకులు, బిజెపి, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.