అనాధాశ్రమంలో నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా
రంగారెడ్డి: జనవరి 1(భారత్ కి బాత్)
నూతన సంవత్సరం సందర్భంగా ఎల్బీనగర్ లోని అనాధాశ్రమంలో స్టూడెంట్స్ తో నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని అనాధ పిల్లలతో కేక్ కట్ చేయించిన అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు మరియు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు లోకేష్ గుప్తా ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఎల్బీనగర్లోని అనాధాశ్రమంలో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు ఒక తండ్రిలాగా బాధ్యతలు చూసుకుంటున్న రాజేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కొత్త సంవత్సరంలో స్టూడెంట్స్ అందరూ బాగా చదువుకొని మంచి మెరిట్ తో ఉన్నత చదువులకు వెళ్లాలని, మంచి ఉద్యోగాన్ని సంపాదించి వచ్చిన శాలరీతో వాళ్ళని కూడా పేద విద్యార్థులకి సహాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అనాధ ఆశ్రమం వ్యవస్థాపకులు రాజేష్, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు చింతల రజనీకాంత్, యువజన సంఘం అధ్యక్షుడు లోకేష్ గుప్తా, మహిళా అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి, జనరల్ సెక్రెటరీ శైలజ, చీఫ్ అడ్వైజర్ మణిమాల, రంగారెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు.