శ్రీరామ ప్రసాదo వితరణ కార్యక్రమం
రంగారెడ్డి: ఫిబ్రవరి 4(భారత్ కి బాత్)
మాజీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆదివారం నాడు సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి నివాసంలో సరూర్నగర్ ప్రజలకు మరియు బిజెపి కార్యకర్తలకు అయోధ్య పుణ్యక్షేత్రం నుంచి తాను తీసుకొని వచ్చినా శ్రీరామ ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అందరు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించానని తెలిపారు.