సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తా: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
రంగారెడ్డి: ఫిబ్రవరి 4(భారత్ కి బాత్)
హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు డివిజన్ లోని యశోద ఎంక్లేవ్ లో కాలనీ వాసులతో కలసి పర్యటించారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు కాలనీలో సీసీ రోడ్ ల సదుపాయం లేకపోవడంతో కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారని తెలపడంతో, కార్పొరేటర్ మాట్లాడుతూ అధికారులతో సమీక్షించి వీలైనంత త్వరగా కాలనీ సమస్యల దిశగా కృషి చేస్తానని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యశోద ఎంక్లేవ్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.