ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పదు: విజయ్ రాథోడ్
1985 సంవత్సరంలో మేడిగడ్డ తండా నుంచి మొట్టమొదగా ప్రభుత్వ బ్యాంక్ లో క్యాషియర్ గా ఉద్యోగo సాధించిన ఏకైక ఉద్యోగి పత్య నాయక్ ను సన్మానించిన విజయ్ రాథోడ్.
1994 సంవత్సరంలో నూతనంగా ఏర్పడిన మేడిగడ్డ తండా గ్రామపంచాయతీ నుంచి మొదటి సర్పంచ్ గా పదవి చేపట్టిన హేమి పత్య నాయక్.
ఏ.పి.జి.బీ బ్యాంక్ లో క్యాషియర్ నుంచి మేనేజర్ గా మరియు ఆడిటింగ్ ఆఫీసర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన పత్య నాయక్ పదవీ విరమణ.
హైదరాబాద్: ఫిబ్రవరి 4(భారత్ కి బాత్)
ఉద్యోగికి తన సర్వీసులో పదవీ విరమణ అనేది తప్పదని, విధులు నిర్వహించడంలో చేసిన సేవలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయని కె.ఎన్.ఆర్ యువసేన జిల్లా నాయకుడు విజయ్ రాథోడ్ అన్నారు. 1985 సంలో మొదటిసారిగా బొమ్మనపల్లి గ్రామంలో నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ లో పదవీ బాధ్యతలు చేపట్టి, సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తు ఆదివారం నాడు పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లోని వి.ఎస్.ఆర్ ఫంక్షన్లో పదవీ విరమణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి విజయ్ రాథోడ్ హాజరై బ్యాంక్ మేనేజర్ పత్య నాయక్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం విజయ్ రాథోడ్ మాట్లాడుతూ మొదటగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత మేడిగడ్డ తండా గ్రామపంచాయతీకి వారి సతీమణి హేమి భాయి మొదటి సర్పంచ్ గా ఎన్నికై, అనేక అభివృద్ధి పనులు చేశారని, ఆ తర్వాత గ్రామ ప్రజలుకు సేవలు చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగాన్నీ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ఎనలేని సేవలతో అధికారుల మన్ననలు పొందారని విజయ్ రాథోడ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మల్లేష్ నాయక్ దేవు, బద్రి, మాల్యా, జైలాల్, హుంల్ల, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.