ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి: కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి
రంగారెడ్డి: ఫిబ్రవరి 6(భారత్ కి బాత్)
సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జోనల్ కమిషనర్ పంకజని కలిసి సరూర్నగర్ డివిజన్లోని అంబేద్కర్ నగర్, భగత్ సింగ్ నగర్, విజయపురి కాలనీ, లక్ష్మీ నగర్, ఎస్బిఐ కాలనీ పెండింగ్ పనులు, పోచమ్మ బాగ్, వెంకటేశ్వర కాలనీ, కృష్ణా నగర్, క్రాంతి నగర్, శంకర్ నగర్ కొత్త రోడ్ సాంక్షన్లు, అలాగే శంకర్ నగర్, భగత్ సింగ్ నగర్, లక్ష్మీ నగర్ పెండింగ్ కమ్యూనిటీ హాల్లు, విజయపురి కాలనీ, జేబీ కాలనీ నాలా పనులు, అక్రమ పార్కింగ్లు, శానిటైజేషన్ విభాగం ఫిర్యాదుల గురించి, హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి కి సంబంధించిన యుజిడి పైప్ లైన్ రిస్టోరేషన్ సమస్యల గురించి వినతి పత్రం అందజేసిన సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సగం త్రవ్వి వదిలేసిన రోడ్లను త్వరగా బాగు చేయించాలని, తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరానని తెలిపారు.