Search for:
  • Home/
  • क्षेत्र/
  • పిపిఎస్ మోటార్స్ వేదికగా దేశంలోనే మొదటి ఇంటెలిజెంట్ సియువి ఎంజి విండ్సర్‌ కారు ఆవిష్కరణ

పిపిఎస్ మోటార్స్ వేదికగా దేశంలోనే మొదటి ఇంటెలిజెంట్ సియువి ఎంజి విండ్సర్‌ కారు ఆవిష్కరణ

రంగారెడ్డి: సెప్టెంబర్ 26(భారత్ కి బాత్)

 

జెఎస్డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వినియోగదారుల కోసం రూ.13,49,800 (ఎక్స్-షోరూమ్)తో ప్రారంభమయ్యే ఎంజి విండ్సర్‌ను విడుదల చేసింది. ఎల్.బి. నగర్‌లోని పిపిఎస్ మోటార్స్ షోరూమ్‌ వేదికగా బుధవారం ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. భారతదేశపు మొదటి ఇంటెలిజెంట్ సియువి సెడాన్ సౌలభ్యాన్ని, ఎస్ యువి యొక్క విస్తీర్ణాన్ని సమ్మిళితం చేసి వినియోగదారులకు విలాసవంతమైన బిజినెస్‌ క్లాస్‌ అనుభవాన్ని అందిస్తుంది. ఎంజి మోటార్, పిపిఎస్ మోటార్స్ అధికారుల సమక్షంలో జాతీయ, దక్షిణాసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ నైనా జైస్వాల్ ఈ సరికొత్త వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జె ఎస్ డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సతీందర్ సింగ్ బజ్వా మాట్లాడుతూ ఎంజి విండ్సర్ ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, అనువైన ధరలతో వినియోగదారులను ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాలు) జీవనశైలికి అప్‌గ్రేడ్ అవ్వడానికి ప్రోత్సహిస్తుందని అన్నారు. ఇది ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడానికి మరింత సమర్థవంతమైన కస్టమర్‌లకు మద్దతునిస్తుందని, పర్యావరణహితమైన భవిష్యత్తుకు అద్భుతమైన మార్గాన్ని అందించగలదని ఆశించారు. అనంతరం పిపిఎస్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వి మాట్లాడుతూ సెడాన్ సౌలభ్యం, ఎస్ యు వి విస్తీర్ణాన్ని సమ్మళితం చేసిన దేశంలోని మొదటి ఇంటెలిజెంట్ సియువి ఎంజి విండ్సర్‌ కారును విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇండస్ట్రీలో మొదటిసారి అందిస్తున్న బాస్ (బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్) ఆఫర్‌తో ఈవీ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులకు ఎంజి వేదికగా మారిందని అన్నారు. తమ మొత్తం అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా ప్రస్తుతం 40% ఉండగా, ఎంజి విండ్సర్‌ ఆవిష్కరణతో ఈ మార్క్‌ 50 శాతానికి అధిగమించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required