Search for:
  • Home/
  • क्षेत्र/
  • నాదర్ గుల్ కృష్ణ సాయి కాలనీలో మెట్రోపొలిస్ క్లినిక్ ఆధ్వర్యంలో ట్రూ హెల్త్ చెకప్ క్యాంప్

నాదర్ గుల్ కృష్ణ సాయి కాలనీలో మెట్రోపొలిస్ క్లినిక్ ఆధ్వర్యంలో ట్రూ హెల్త్ చెకప్ క్యాంప్

రంగారెడ్డి: సెప్టెంబర్ 17(భారత్ కి బాత్)

 

మహేశ్వరం నియోజకవర్గం నాదర్ గుల్ లోని మెట్రోపొలిస్ క్లినిక్ & ఆదివెల్ మెడిసిన్స్ ఎల్.ఎల్.పి. సంయుక్త ఆధ్వర్యంలో నాదర్ గుల్ లో కృష్ణ సాయి కాలనీలో సోమవారం సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు ట్రూ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ సాయి కాలనీకి చెందిన దాదాపు 50 మంది ఈ మెడికల్ క్యాంపులో పాల్గొని రక్త పరీక్షలు చేయించుకున్నారు. మెడికల్ క్యాంపు నిర్వాహకులు విష్ణు కరోల్లు మాట్లాడుతూ సోమవారం నాడు నిర్వహించిన క్యాంపులో పాల్గొన్న వారికి రక్తపరీక్షలు నిర్వహించామని వాటి ఫలితాలు రాగానే తగు చికిత్స అందిస్తామన్నారు. అంతేకాకుండా ఒక సంవత్సరం ప్యాకేజీ తీసుకున్నట్లయితే కుటుంబంలో నలుగురికి సంవత్సరం పాటు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి వారికి అందించే మెడిసిన్స్ లో 20% డిస్కౌంట్ ఇస్తామన్నారు. మరిన్ని వివరాల కొరకు నాదర్ గుల్ లోని మెట్రోపొలిస్ క్లినిక్ ని సంప్రదించాలని కోరారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required