రాక్ టౌన్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం
రంగారెడ్డి: సెప్టెంబర్ 16(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం రాక్ టౌన్ కాలనీ రాక్ టౌన్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం లడ్డు, కలశం, సిల్వర్ కాయిన్స్ లు అసోసియేషన్ సభ్యులు వేలం పాట నిర్వహించారు. లడ్డు వేలం పాటలో రూ.310116 లకు తుమ్మలపల్లి ప్రసన్న మణిపాల్ రెడ్డి, కలశం రూ.51116 లకు మాచినేని శోభారాణి దేవయ్య, సిల్వర్ కాయిన్స్ తుమ్మలపల్లి పావని శ్రీకాంత్ రెడ్డి రూ.35116 లకు వేలం పాటలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి రోజూ వినాయకుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల అలంకరణలతో వినూత్నంగా అలంకరించామని తెలిపారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక కుంకుమార్చన, ఆదివారం రోజున సుమారు రెండు వేల మందికి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో రాక్ టౌన్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్ర వినోద్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ టి. మణిపాల్ రెడ్డి, ఎక్స్ ప్రెసిడెంట్ పాల్వాయి రామ్ రెడ్డి, భీమిడి మాధవ రెడ్డి, కొంతం కొండల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, సంపత్ కుమార్, వీరయ్య, ప్రతాప్ రెడ్డి, ప్రభు లింగం, రాం చంద్రారెడ్డి, ఆర్. సంజీవ రెడ్డి ఇతర కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.