Search for:
  • Home/
  • क्षेत्र/
  • గౌరీ నందన్ సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డు వేలం పాట

గౌరీ నందన్ సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డు వేలం పాట

హైదరాబాద్: సెప్టెంబర్ 16(భారత్ కి బాత్)

 

ముసారాంబాగ్ డివిజన్ లోని టి జంక్షన్ దగ్గర గౌరి నందన్ సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డు వేలం పాట నిర్వహించారు. ఈ సంవత్సరం లడ్డు వేలం పాటలో ఎస్ వి ఇన్ఫ్రా డెవలపర్స్ కొండా లక్ష్మణ్ రూ.99999 లకు వేలం పాటలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గౌరీ నందన్ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ లడ్డు వేలం పాటలో దక్కించుకున్నటువంటి కొండా లక్ష్మణ్ కి తమ అభినందనలు తెలియజేస్తూ వారు చేస్తున్న వ్యాపారంలో గణనాథుని ఆశీస్సులు పొందుతూ ముందుకెళ్లాలని ఆ గణనాథున్ని కోరమన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా గౌరీ నందన సేవాసమితి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరీ నందన్ సేవా సమితి సభ్యులు విశాల్, కొండా సంపత్, అంబటి సాయి కిరణ్, సంపత్, శశికాంత్, శివరామకృష్ణ వేణుగోపాల్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required