యాదవ్ నగర్ లోని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక శోభాయాత్ర
రంగారెడ్డి: సెప్టెంబర్ 16(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లోని యాదవ్ నగర్ లో వినాయక నిమజ్జన మహోత్సవాలు, శోభాయాత్ర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవ్ నగర్లో గత 26 సంవత్సరాలుగా గణనాథుడికి పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శోభాయాత్రకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రాజు యాదవ్, వినోద్ యాదవ్, శ్రీకాంత్ గౌడ్ స్థానిక నాయకులు పెద్ద ఎత్తున ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు.