మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి
రంగారెడ్డి: మార్చి 13(భారత్ కి బాత్)
మహిళలు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ మడిపడిగే రాజు అన్నారు. అంతర్జాతీయ మహిళా వేడుకల దినోత్సవం సందర్భంగా ఎల్బీనగర్ కర్మన్ ఘాట్ శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ మడిపడిగే రాజు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో వందలాదిగా మహిళలు పాల్గొని పలు సంస్కృతిక కార్యక్రమాల్లో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆటపాటలతో అలరించారు. తంబోలా, స్పాట్ గేమ్స్, ఫన్ గేమ్స్, అంత్యాక్షరి ఆటపాటలతో చిన్న, పెద్ద తేడా లేకుండా ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలకు స్కూటీని బహుమతిగా ప్రధానం చేశారు. వాసవి గ్రూప్ చైర్మన్, వాసవి విల్స్ అధినేత పి. వెంకటేశం గుప్తా సహాయంతో లక్కీ డ్రాలో గెలుపొందిన విజేత బండారి మోహనమ్మ, జనార్ధన్ దంపతులకు ఎలక్ట్రిక్ స్కూటీని అందజేశారు.