Search for:
  • Home/
  • क्षेत्र/
  • ముసారంబాగ్ లో ఘనంగా ప్రారంభమైన డబ్ల్యూఈ 8 @ బాక్స్ క్రికెట్

ముసారంబాగ్ లో ఘనంగా ప్రారంభమైన డబ్ల్యూఈ 8 @ బాక్స్ క్రికెట్

బాక్స్ క్రికెట్ కు భలే క్రేజ్

గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించిన నయా క్రీడ

హైదరాబాద్: సెప్టెంబర్ 16(భారత్ కి బాత్)

మలక్పేట్ నియోజకవర్గం ముసారంబాగ్ లో ఆరోరా కాలేజ్ ఎదురుగా ఆదివారం డబ్ల్యూఈ 8 @ బాక్స్ క్రికెట్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ లింగాల హరి గౌడ్, బీసీ యువజన సంఘం అధ్యక్షులు కనకాల శ్యామ్ హాజరై మాట్లాడుతూమైదానాల కొరతతో క్రీడాకారుల చూపుబాక్స్ క్రికెట్ లీగ్ లతో యువత సంపాదన. క్రికెట్ ఆడాలంటే విశాలమైన క్రీడా మైదానం ఉండాలన్నది ఒకప్పటి మాట. ప్రస్తుతం ట్రెండ్ మారింది.. ఉరుకులు పరుగుల జీవితంలో అన్నీ మారినట్లే క్రికెట్ ఆట కూడా మారింది. పెరుగుతున్న జనాభాతో నగరంతో పాటు నగర శివార్లలో నిర్మితమవుతున్న నివాసాలతో విశాలమైన మైదానాలు నేడు కనుమరుగవుతున్నాయి. దీంతో క్రీడా మైదానాలు లేక చాలా మంది ఆటలకు దూరమవుతున్నారు. ఈ సమయంలోనే బాక్స్ క్రికెట్ ప్రాచూర్యం పొందుతోంది. 1970 దశకంలో ప్రాచుర్యం పొందిన ఇండోర్ క్రికెట్ పై ప్రస్తుతం మక్కువ పెరిగింది. కేవలం 400 నుండి 600 గజాల స్థలంలోనే బాక్స్ క్రికెట్ ఇండోర్ స్టేడియం నిర్మించవచ్చు. ఖర్చు కూడా తక్కువే. దీంతో స్వయం ఉపాధి మార్గాలు అన్వేషిస్తున్న యువత బాక్స్ క్రికెట్ వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్ లో ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. దీంతో పాటు టీసీఎస్, టాటా సంస్థలు, పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో బాక్స్ క్రికెట్ కు మంచి ఆదరణ లభిస్తోందని యాజమాన్యం వారు తెలిపారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required