ముసారంబాగ్ యువశక్తి ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం
హైదరాబాద్: సెప్టెంబర్ 16(భారత్ కి బాత్)
ముసారంబాగ్ డివిజన్లోని గౌర విజయ్ కుమార్, హనుమల భరత్ కుమార్ బీజేవైఎం భాగ్య నగర్ జిల్లా ప్రెసిడెంట్ సంయుక్త ఆధ్వర్యంలో టీవీ టవర్ ఎక్స్ రోడ్ వద్ద ఆదివారం గణేష్ పూజ మహోత్సవం, అన్నప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భాగ్యనగర్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ శ్యామ్ రెడ్డి సురేందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ జి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాగ్యనగరంలో ఈనెల 17వ తారీఖున గణేష్ నిమజ్జనానికి ఎటువంటి ఆటంకాలు కల్పించకుండా సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. భాగ్యనగరంలోని హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఆటంకాలపై ప్రశ్నించారు. భారీ ఆకారంలో ఉన్న వినాయకుని ఏర్పాటు చేసి అత్యంత ఘనంగా పూజా కార్యక్రమాలు, అన్నప్రసాదాలు నిర్వహిస్తున్న ముసారంబాగ్ యువశక్తి సభ్యులను అభినందించారు.