శ్రీ భువి ప్రాపర్టీస్ చైర్మన్ వర్కల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
హైదరాబాద్: సెప్టెంబర్ 16(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేటలోని అంకుర హాస్పిటల్ పక్కన శ్రీ భువి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సారథ్యంలో చైర్మన్ వర్కల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం గణనాథుని పూజ మహోత్సవం మరియు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్కల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఏ కొత్త ప్రభుత్వం ఏర్పడిన గాని మొదట్లో ఒడిదుడుకులు ఏర్పడడం సహజమేనని, అమ్మవారి దసరా నవరాత్రులు ముగిసిన వెంటనే మళ్లీ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ వెంచర్లు నాగార్జునసాగర్ హైవేలోనే గత పది సంవత్సరాలుగా హెచ్ఎండిఏ, డిటిసిపి, ఫామ్ ల్యాండ్ లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆర్ఆర్ఆర్ వల్ల భూముల ధరలు ఆకాశo అంత ఎత్తుకి ఎదుగుతాయని, ప్రజలందరూ తమ శక్తి మేరకు భూములను కొనుగోలు చేసి, భవిష్యత్తులో లాభాలను ఆర్జించాలని వర్కల వెంకటేష్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ భువి ప్రాపర్టీస్ స్టాఫ్, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.