బడంగ్పేట్ లో నూతనంగా ప్రారంభమైన కమ్మటి నేతి ఇడ్లీ
రంగారెడ్డి: సెప్టెంబర్ 17(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మునిసిపల్ కార్పొరేషన్ లో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా సోమవారం కమ్మటి నేతి ఇడ్లీ హోటల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా యజమానులు శామ్యూల్,
శ్రీకాంత్, నాగ కిరణ్, గాయత్రి లు మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల టిఫిన్లు వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సుచికి, శుభ్రతకి ప్రథమ స్థానం ఇచ్చామని, నాణ్యతలో ఎక్కడ రాజీపడలేదని, ప్యాకెట్లలో దొరికే నెయ్యి కాకుండా సహజ సిద్ధమైన నెయ్యిని ధర ఎక్కువ అయినా సరే కస్టమర్ల ఆరోగ్యం కోసం ఉపయోగిస్తున్నామని తెలిపారు. థీమ్ కూడా పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.