Search for:
  • Home/
  • क्षेत्र/
  • మధురానగర్ లో ప్రవీణ్ గుప్తా ఆధ్వర్యంలో గణపతి పూజ మహోత్సవం, అన్న ప్రసాద కార్యక్రమం

మధురానగర్ లో ప్రవీణ్ గుప్తా ఆధ్వర్యంలో గణపతి పూజ మహోత్సవం, అన్న ప్రసాద కార్యక్రమం

రంగారెడ్డి: సెప్టెంబర్ 15(భారత్ కి బాత్)

 

మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ డివిజన్లోని మధురానగర్ లో ప్రవీణ్ గుప్తా ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం గణపతి పూజ మహోత్సవం, అన్న ప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిలుగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పోరేటర్లు సిద్ధాల బీరప్ప, అనిల్ యాదవ్ హాజరయ్యారు. శుక్రవారం నాడు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బాలబాలికలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు చక్కటి వేషధారణ, సాంప్రదాయ నృత్యాలతో స్థానికులను అలరించారు. అన్న ప్రసాద కార్యక్రమంలో దాదాపు 1000 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం. మల్లయ్య, జి. ప్రసాద్, వెంకటేష్ జెసిబి, కిషన్ రెడ్డి, జి. ప్రభాకర్ రెడ్డి, జి. శేఖర్, కె. శేఖర్, శివారెడ్డి, మణి వర్ధన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, మల్లేష్ గోల్డ్ షాప్, ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required