వీరాంజనేయ భక్త సమాజం వారి మహా గణపతిని దర్శించుకోనున్న అందెల శ్రీరాములు
రంగారెడ్డి: సెప్టెంబర్ 14(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బడంగ్పేట్ గ్రామంలోని శ్రీ వీరాంజనేయ భక్త సమాజం వారి యొక్క మహా గణనాథుడిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ శనివారం సాయంత్రం 7:30 గంటలకు బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి నాయకులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామని తెలిపారు. కావున భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామని మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ కోరారు.