బాలాపూర్ వినాయకుడిని దర్శించుకున్న పారిజాత నర్సింహా రెడ్డి, పోలీసు శాఖ ఉన్నతాధికారులు
రంగారెడ్డి: సెప్టెంబర్ 14(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బాలాపూర్ వినాయకుడి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ డా. జితేందర్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మరియు హైదరాబాద్ కి చెందిన పలు ఏసీపీలు, డీసీపీ లతో టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.