విజయ సంకల్ప యాత్రకి ముఖ్య అతిథిగా రానున్న నూకల నరసింహారెడ్డి
నల్గొండ: ఫిబ్రవరి 22(భారత్ కి బాత్)
మిర్యాలగూడ నియోజకవర్గంలో శుక్రవారం నాడు నిర్వహించబోయే తెలంగాణ బిజెపి విజయ సంకల్ప యాత్రకి సంబంధించిన సమావేశం కలదు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి హాజరు కానున్నారు.
శుక్రవారం ఉదయం 9: 00గంటలకు మిర్యాలగూడలోని బృందావనం గార్డెన్ నందు మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో బిజెపి విజయ సంకల్ప యాత్ర సమావేశం కలదు. ఈ సమావేశానికి అతిథులుగా బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి రానున్నారు. కావున మిర్యాలగూడ నియోజకవర్గంలోని రాష్ట్ర నాయకులు, రాష్ట్ర, జిల్లా వివిధ మోర్చాల నాయకులు, జిల్లా నాయకులు, మండలాల అధ్యక్షులు, మండల మోర్చాల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, శక్తి కేంద్రం ఇంచార్జీలు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నామని పత్రికా ప్రకటనలో బిజెపి శ్రేణులు తెలిపారు.