సైదాబాద్ లో నూతనంగా ప్రారంభమైన ఇండియన్ డెంటల్ స్పెషాలిటీస్
హైదరాబాద్: ఆగష్టు 25(భారత్ కి బాత్)
మలక్పేట్ నియోజకవర్గం సైదాబాద్ డివిజన్లో కదారియా మసీదు పక్కన ఆదివారం నాడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇండియన్ డెంటల్ స్పెషాలిటీస్ హాస్పిటల్ ను ప్రారంభించారు. ఇందులో భాగంగా మలక్పేట్ నియోజకవర్గం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలలా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డెంటల్ సర్జన్ డాక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ మాట్లాడుతూ మా వద్ద ప్రత్యేకంగా డెంటల్ స్కానర్స్ కూడా అందుబాటులో ఉన్నాయని, కస్టమర్స్ కి ఎటువంటి నొప్పి లేకుండా నూతన అడ్వాన్స్డ్ పద్ధతిలో ఏఐ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా చికిత్స అందిస్తామని అన్నారు. మాకు మలక్పేట్, సైదాబాద్, కొత్తపేట్, చాదర్ఘాట్, గుంటూరులో కూడా బ్రాంచ్ లు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు తెహసీన్ అరా, అంజూమ్ కహాకషన్, అభిహ మొహీనుద్దీన్, శబ్నం గుల్భిషాన్, విశ్వజ, కుశన్, రేవత్ వ్యాస్, స్వాతి, మహమ్మద్ సోహెల్, లహరి, ఎమ్. సతీష్ కుమార్, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.
ఇండియన్ డెంటల్ స్పెషాలిటీస్ హాస్పిటల్ అపాయింట్మెంట్ కొరకు 040- 25467477 ను సంప్రదించగలరని యాజమాన్యం వారు తెలిపారు.