ఎల్బీనగర్ లో నూతనంగా ప్రారంభమైన ప్రో స్పోర్ట్స్ షాప్
రంగారెడ్డి: జులై 22(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ ఎల్ పి టి మార్కెట్ 2nd ఫ్లోర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రో స్పోర్ట్స్ షాపును సోమవారం నాడు ఉదయం ఎల్బీనగర్ కంటెస్టెడ్ ఎమ్యెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ మా సోదరుడు కరణ్ గౌడ్ స్పోర్ట్స్ షాపును ఏర్పాటు చేయడం సంతోషకరమని, ఎల్బీనగర్ పరిసర ప్రాంత యువకులకు అందుబాటులో ఉండే విధంగా క్రికెట్, షటిల్, వాలీబాల్ వంటి ఆట వస్తువులు హోల్ సేల్ రేట్లకే లభిస్తాయని తెలిపారు. ఎల్బీనగర్ పరిసర ప్రాంత యువకులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా యజమాని కరణ్ గౌడ్ మాట్లాడుతూ ఓపెనింగ్ ఆఫర్ 33% డిస్కౌంట్ ఇంగ్లీషు విల్లో బ్యాట్స్ మీద, యోనాక్స్ షటిల్ బ్యాట్స్ మీద 50% వరకు డిస్కౌంట్, మిగతా వాటి మీద స్పెషల్ డిస్కౌంట్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ షాప్ యజమాని కరణ్ గౌడ్, రాఖీ గౌడ్, గద్దె విజయ్ నేత తదితరులు పాల్గొన్నారు.