రాఘవేంద్ర నగర్ కాలనీలో నూతనంగా ప్రారంభమైన శ్రీ ఆకాంక్ష టి అండ్ టిఫిన్స్
రంగారెడ్డి: జులై 22(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపాలిటీ జిల్లెలగూడ రాఘవేంద్ర నగర్ కాలనీలో సోమవారం నాడు నూతనంగా శ్రీ ఆకాంక్ష టి మరియు టిఫిన్స్ ను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. గౌరవ అతిథిగా పాల్గొన్న మీర్పేట్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ విక్రం రెడ్డి. ఈ సందర్భంగా యజమాని సంతోష్ మాట్లాడుతూ నాణ్యతలో రుచిలో ఎక్కడ రాజీపడకుండా వినియోగదారులకు మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ విక్రం రెడ్డి, బంధువులు, స్నేహితులు, సిలివేరు సాయి బాబా, ఈర్లపల్లి శివ, కాటారపు శివ, కాటారపు శశికాంత్, కందుల శివ శంకర్, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.