ఘనంగా దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు
రంగారెడ్డి: జులై 7(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గం, సరూర్నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. శాలువాలతో బొకేలతో సత్కరించి తదనంతరం కేక్ కట్ చేయించి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ నా పుట్టినరోజు వేడుకలకు తరలివచ్చిన అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.