శారద నగర్ లో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్న సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం
ప్రజల దాహార్తిని తీరుస్తున్న సీనియర్ సిటిజన్స్
రంగారెడ్డి: మే 12(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం శారద నగర్ లో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వేసవికాలం సందర్భంగా బాటసారుల దాహార్తిని తీర్చడం కోసం గత 15 సంవత్సరాలుగా చలివేంద్రంలో ఏర్పాటు చేశారు. వేసవిలో ఎండలు మండుతుండడంతో దాహార్తిని తీర్చడానికి మజ్జిగ పంపిణీ చేపడుతున్నారు. ఈ సందర్భంగా శారద నగర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరమ్ చైర్మన్ వి.ఆర్.కె. హనుమంతరావు మాట్లాడుతూ.. సమాజ సేవలో తమ వంతు బాధ్యతగా బాటసారుల దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేగాకుండా వివిధ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలతో పాటు వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు అన్నారు. సేవా కార్యక్రమాలు చేపడుతున్న సీనియర్ సిటిజన్స్ కు అండగా ఉండాలని కోరారు. తమకు తోచిన సహాయం అందిస్తే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రఘురామయ్య, సెక్రటరీ హరి ప్రసాద్, సంయుక్త కార్యదర్శులు శివాజీ కుమార్, ఆంజనేయులు, సభ్యులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.